నేడు ఎడపల్లిలో కల్తీ కల్లు పై అవగాహన కార్యక్రమం

NZB: కల్తీకల్లు సమాజంలో ప్రభావంపై ఎడపల్లితో పాటు మంగళ్పహాడ్, కుర్నాపల్లి, జాన్కంపేట్ గ్రామాల్లో నేడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణా రెడ్డి తెలిపారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో నోడల్ ఏజన్సీ ఆధ్వర్యంలో ప్రజలకు ఈ అవగాహన కార్య క్రమం చేపడుతున్నట్లు దీనికి జిల్లా స్థాయి పోలీస్, ఎక్సైజ్ అధికారులు హాజరు కానున్నారని తెలిపారు.