తణుకులో సీపీఐ జిల్లా మహా సభలు

తణుకులో సీపీఐ జిల్లా మహా సభలు

W.G: ఈనెల 19, 20 తేదీల్లో తణుకులో జరుగనున్న సీపీఐ 27వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. శనివారం తణుకు స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ ఆఫ్ అక్కమాంబ టెక్స్ టైల్స్ కార్యాలయంలో ఫ్యాక్టరీ కార్మికుల సమావేశం జరిగింది. కార్మికులు, కర్షకులు, కష్టజీవుల అభ్యున్నతే లక్ష్యంగా వందేళ్లుగా నిర్విరామంగా ఉద్యమిస్తున్నామన్నారు.