కాంగ్రెస్ పార్టీకి భారీగా విరాళాలు
2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు భారీగా విరాళాలు అందాయి. హస్తం పార్టీకి ఏకంగా రూ.517 కోట్లకు పైగా విరాళాలు సమకూరాయి. 2023-24లో అందుకున్న రూ.281.48 కోట్లతో పోలిస్తే.. ఈ సారి రెట్టింపు రావటం విశేషం. ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రూ.313 కోట్లు, మిగిలినవి వివిధ ట్రస్టుల ద్వారా వచ్చాయి. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీకి భారీగా విరాళాలు రావటం చర్చనీయాంశమైంది.