సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

KMR: సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శనివారం ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. హోమంలో పాల్గొని, సింధూర పూజ చేసి నైవేద్యాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.