మగువలకు మంటలే కానుకలా:POW
GDWL: మహిళా దినోత్సవం వేళ గ్యాస్ ధరల పెంపుతో ప్రభుత్వం మహిళల కళ్లలో కన్నీళ్లు మిగిల్చుతోందని POW జిల్లా అధ్యక్షురాలు శ్రావణి విమర్శించారు. లింగాపురంలో జరిగిన నిరసనలో ఆమె మాట్లాడుతూ.. పెట్రోల్, గ్యాస్, నిత్యవసరాల ధరలు పెంచుతూ బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.