నీటి బురదతో వాహనదారుల ఇబ్బందులు

నీటి బురదతో వాహనదారుల ఇబ్బందులు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం హైవేలో బస్టాండ్ నుంచి పెట్రోల్ పంప్ వరకు రోడ్డు కుడివైపు చిన్న వర్షానికే నీరు నిండి బురదమయం అవుతోంది. వర్షంలో టూ-వీలర్ వాహనదారులు రోడ్డు పక్కకు వెళ్లగానే స్కిడ్ అవుతూ బురదలో పడిపోతున్నారు. నడిచే వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.