జలధారతో జలసిరులు: కలెక్టర్
VZM: ‘జలధార-జలహారతి’ కార్యక్రమం ద్వారా జలసిరిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని గణనీయంగా పెంచడం, గరిష్ట ఉపరితల నీటితో జలవనరులన్నీ కలకలలాడేలా చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జలధార కార్యక్రమానికి సీఎం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు.