VIDEO: పోగొట్టుకున్న ఫోన్‌లు పదిలం.. బాధితుల్లో హర్షం!
SRPT: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను రికవరీ చేసి బాధితులకు SRPT పోలీసులు భరోసా కల్పించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఇవాళ ఎస్పీ కార్యాలయంలో 104 మంది బాధితులకు రికవరీ చేసిన ఫోన్‌లను పంపిణీ చేశారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వీటిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. విలువైన సమాచారం ఉన్న ఫోన్‌లను తిరిగి దక్కడంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.