'కష్టసుఖాల్లో అండగా నిలవడమే టీడీపీ లక్ష్యం'

'కష్టసుఖాల్లో అండగా నిలవడమే టీడీపీ లక్ష్యం'

VZM: ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అండగా నిలవడమే తమ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. శుక్రవారం చీపురుపల్లిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, పరిష్కారానికి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.