ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాట్ల

తూ.గో: ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 42,273 మంది లబ్ధిదారులకు రూ.28.11 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేపట్టారు. సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు.