VIDEO: నందిగుంట చెరువులో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా

NLR: వింజమూరు మండలం నందిగుంట చెరువులో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డాగా మారిపోయింది. అడ్డూ అదుపూ లేకుండా తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో మాఫియా మరింతగా రెచ్చిపోయి ప్రయివేట్ లే అవుట్‌కు గ్రావెల్‌ను తరలించేస్తున్నారని స్థానికులు వాపోయారు. పగలు రాత్రి లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.