రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్ ఎంపికలు

రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్ ఎంపికలు

MDK: జిల్లా స్థాయి అథ్లెటిక్ ఎంపికలు ఈనెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ సోమవారం తెలిపారు. బాల బాలికల అండర్- 14, 16, 18, 20 పరుగు పందెం, త్రో గేమ్స్ ఉంటాయని చెప్పారు. ఎంపికైన వారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.