'మీడియా స్వేచ్ఛను కాపాడాలి'
NRML: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే మీడియా స్వేచ్ఛను కాపాడాలని టీయూడబ్ల్యూజే ఐజేయు ప్రధాన కార్యదర్శి భూమయ్య అన్నారు. శనివారం సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కోరుతూ.. దిలావర్పూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం మీడియా పట్ల నిష్పక్షపాతంగా ఉండాలన్నారు.