VIDEO: సింగరాయకొండలో ఓ సునకం కష్టాలు

VIDEO: సింగరాయకొండలో ఓ సునకం కష్టాలు

ప్రకాశం: ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న తినుబండారాల కోసం వెతకడం ఓ శునకం ప్రాణం మీదకు తెచ్చింది. సింగరాయకొండలోని మూలగుంటపాడు వద్ద మంగళవారం ఓ వీధి కుక్క ప్లాస్టిక్ డబ్బాలో తల దూర్చగా.. అది ఇరుక్కుపోయింది. దాన్ని వదిలించుకోలేక, ఊపిరాడక ఆ కుక్క తీవ్ర అవస్థలు పడింది. ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీస్తూ ఆ మూగజీవి పడ్డ ఇబ్బంది స్థానికులను కలచివేసింది.