గొల్లప్రోలులో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

గొల్లప్రోలులో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

E.G: గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహశీల్దార్ జి. రామ్‌కుమార్ సారథ్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓటు హక్కు విలువను వివరించి, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఓటు ప్రతిజ్ఞ చేయించారు.