VIDEO: రామాపురం సాగర్ కట్టపై భయపెడుతున్న కోతులు
SRPT: నడిగూడెం మండలం రామాపురం నాగార్జున సాగర్ కట్టపై వానర సైన్యం వాహనదారులను హడలెత్తిస్తోంది. ఆహారం కోసం కోతుల గుంపులు రోడ్లపైకి వస్తుండడటంతో ప్రయాణికులు, వ్యవసాయ కూలీలు వణికిపోతున్నారు. అడవులు అంతరించిపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.