నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా: కవిత
NZB: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మరో ఆసక్తికర విషయం తెలిపారు. 'మేము ఎవరికీ బీ-టీమ్ కాదు. అవసరమైతే నిజామాబాద్ నుంచే పోటీ చేస్తా. పాత, కొత్త రక్తంతో పనిచేస్తాం. మాది ఎప్పటికీ ప్రాంతీయ పార్టీ గానే ఉంటుంది' అని పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 25న జెండాను ఆవిష్కరిస్తానని తెలిపారు.