‘ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి’

KMM: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకుడు షేక్ నాగూర్ వలి అన్నారు. శుక్రవారం మధిరలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. CPSను రద్దుచేసి OPSను పునరుద్ధరించాలని చెప్పారు. అలాగే జేఎల్ పదోన్నతిలో 40% కోట పునరుద్ధరించాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని పేర్కొన్నారు.