గ్రామంలో కూలిన చెట్లు తొలగించాలంటూ వినతి

గ్రామంలో కూలిన చెట్లు తొలగించాలంటూ వినతి

SKLM: ఆమదాలవలస మండలం కట్యాచార్యుల పేట గ్రామంలో శివాలయం వద్ద పై కప్పు రేకులు గురువారం రాత్రి కురిసిన గాలి వానకు ఎగిరిపోయాయని గ్రామ సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు శుక్రవారం తెలిపారు. పెద్ద పెద్ద చెట్లు నేలకూలడంతో పక్కనే ఉన్న దుకాణదారులు గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.