పాడిపశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

పాడిపశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

VZM: తెర్లాం మండలం పెరుమాలి గ్రామంలో పశు వైద్యాధికారి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో సోమవారం పాడి పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. 480 పాడి పశువులకు ఈ టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారులు తెలిపారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పశుసంవర్ధక సహాయకులు పాల్గొన్నారు.