నేటి నుంచి కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం

AP: ఇవాళ్టి నుంచి రెండురోజుల పాటు రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌరసేవల అమలు వంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు.