ఉట్నూర్‌లో జాబ్ మేళా
ADB: ఉట్నూర్ ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలలో ఈనెల 24న మెగా అప్రెంటిషిప్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. వాహన తయారీ సంస్థలలో ఉద్యోగ అవకాశాలతో పాటు నైపుణ్య శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన 18 నుంచి 25 ఏళ్ల యువకులు తమ సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.