ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రులో సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇవాళ ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు విక్రయించిన ధాన్యానికి 5 గంటల్లోపే చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని అన్నారు.