VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు

NGKL: పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా కోసం ఈరోజు రైతులు బారులు తీరారు. ఇక రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండటంతో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రైతుకు యూరియా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. మహిళ రైతులు సైతం ఉదయం నుంచి భారీ క్యూ లో నిలబడ్డారు.