నిజామాబాద్ ప్రజావాణికి 74 ఫిర్యాదులు

నిజామాబాద్ ప్రజావాణికి 74 ఫిర్యాదులు

NZB: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 74 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్ తదితరులు ఉన్నారు.