VIDEO: వెంకన్న హుండీ ఆదాయం ఎంతంటే.?
ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 80 రోజులకి గాను రూ.11,36,434 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య లెక్కింపు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.