శవపేటికను మోసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు

శవపేటికను మోసిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు

ATP: ఉరవకొండ మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన టీడీపీ దూదేకుల సాధికార కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్, రిటైర్డ్ ఎస్పీ షేక్షావలి మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ ఆయన నివాసానికి చేరుకున్నారు. పార్థివ దేహంపై టీడీపీ జెండా కప్పి, శవపేటికను మోశారు. అలాగే, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.