VIDEO: అక్రమంగా తరలిస్తున్న కలప వాహనం పట్టివేత
ASR: దేవీపట్నం మండలం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా కలపను రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నామని అటవీ శాఖ రేంజ్ అధికారి కొండలరావు శుక్రవారం తెలిపారు. ఇందుకూరుపేట గ్రామ సమీపంలో ఈ వాహనాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఎటువంటి అనుమతులు లేకుండా కలప అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.