VIDEO: ములుగు జిల్లాలో అరుదైన గబ్బిలాలు
MLG: జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఉన్న చెట్లపై వందల సంఖ్యలో గబ్బిలాలు నివాసం ఉంటున్నాయి. ప్రస్తుతం అంతరించిపోతున్న గబ్బిలాలు ములుగు జిల్లా అటవీ శాఖ కార్యాలయం వద్ద, పాలంపేట రామప్ప సమీపంలోని కేన్ మొక్కల ప్రాంతంలో మాత్రమే మనకు దర్శనమిస్తాయి. గబ్బిలాల ( క్షీరదాల) మనుగడ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.