ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్

GDWL: క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సంతోశ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్య అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తుందన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉండాలన్నారు.