కడప కలెక్టర్ సూచనలు ఇవే

KDP: గణేశ్ ఉత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కడప కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. తన క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పర్యావరణ సహిత మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని సూచించారు.