'ఫోక్సో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి'

NRPT: పెండింగ్‌లో ఉన్న ఫోక్సో కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం నారాయణపేట కోర్టు సమావేశం మందిరంలో పోలీస్, కోర్టు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 13న జరిగే లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు.