పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్
గుంటూరు రూరల్ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాయపాలెం ప్లాట్స్‌లో జరుగుతున్న పేకాట స్థావరంపై ఆదివారం టాస్క్ ఫోర్స్ బృందం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,990 నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.