'ఈ నెల 8న మార్టేరులో కిసాన్ మేళా'
W.G: మార్టేరు వరి పరిశోధనా కేంద్రంలో ఈనెల 8న భారీ 'కిసాన్ మేళా' నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి(ఏవో) డాక్టరు జ్యోషిలా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆమె కోరారు. సాగు పద్ధతులపై అవగాహనతో పాటు, శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు నేరుగా అందిస్తారని పేర్కొన్నారు.