కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు
RR: కొత్తూరు మండలం ఎస్బిపల్లి గ్రామంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లోకి చేరారు. వారికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.