చంటి బిడ్డలతో పోలింగ్ కేంద్రాలకు తల్లులు
KNR: జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌లో చంటి పిల్లలతో తల్లులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెలల శిశువులను ఎత్తుకొని మరీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారు తరలివచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్‌లో శిశువుతో వచ్చి ఓ మహిళ ఓటు వేయగా, ఆసిఫ్ నగర్‌లో ఇద్దరు మహిళలు తమ పసి బిడ్డలతో వచ్చి ఓటేశారు.