నేడు జిల్లాకు రానున్న మంత్రి మండిపల్లి
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం మదనపల్లెకు చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగే DDRC సమావేశంలో హాజరై అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అనంతరం రాయచోటికి వెళ్లి రాత్రి బస చేయనున్నారు.