'అమితాబ్ బచ్చన్ సూచనలతో ప్రాణాలు కాపాడండి'
HYD: రోడ్డు భద్రతకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన అవగాహన వీడియోను షేర్ చేశారు. "అప్రమత్తంగా ఉండండి, ప్రాణాలను కాపాడండి. వాహనం ఆగినప్పుడు, దానిని సురక్షితంగా నిలిపివేయండి. ఇతరులకు కనిపించడం కోసం పార్కింగ్ లైట్లు ఆన్ చేయండి. నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే హై-బీమ్ లైట్లను వాడండని వీడియోలో అమితాబ్ బచ్యన్ తెలిపారు.