దంపతుల మృతి కేసులో వీడిన మిస్టరీ

దంపతుల మృతి కేసులో వీడిన మిస్టరీ

VSP: అక్కయ్యపాలెంలో కలకలం రేపిన దంపతుల మృతి కేసు మిస్టరీ వీడింది. అనిత మృతదేహంపై గోళ్ల గాట్లు, గొంతును దుప్పటితో బిగించిన గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. పోలీసులు ఇది హత్య అని నిర్ధారించారు. అనుమానంతో భర్త, భార్య (అనిత) గొంతును ఊపిరాడకుండా చేయడంతో చనిపోయినట్లు తెలిపారు. అనిత చనిపోయిందన్న భయంతోనే వాసు కూడా ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.