రాష్ట్రంలో పలుచోట్ల రాకపోకలు బంద్

రాష్ట్రంలో పలుచోట్ల రాకపోకలు బంద్

TG: అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండలో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కొత్తకోట-ఆత్మకూరు-వనపర్తి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో వరద పోటెత్తడంతో లో లెవెల్ వంతెనలు మునిగిపోయి రోడ్డు మార్గం మూసుకుపోయింది. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.