నడి రోడ్డుపై నాగుపాము

WGL: చెట్లపొదల్లో, పుట్టల్లో ఉండే నాగన్న నక్కలగుట్టలో నడి రోడ్డుపై ప్రత్యేక్షమైంది. నిత్యం వాహనాలతో జనాలతో రద్దీగా ఉండే రోడ్డుపై పాము కనిపించడంతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. నాగుపాము పడగ విప్పి బుసలు కొడుతూ.. కొన్ని గంటల పడుకదలకుండా ఉంది. వాహనాదారులు పాముకు ఇబ్బంది కలిగించకుండ దారిని మళ్ళించారు. చివరికి పాము నెమ్మదిగా చెట్లలోకి వెళ్లిపొవడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.