పోలీసు స్టేషన్‌లో వందేమాతరం గేయాలాపన
ASR: జాతీయ గేయం వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జీ.మాడుగుల సీఐ బీ.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై షణ్ముఖరావు, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినాయగన్, స్టేషన్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఏపీఎస్పీ సిబ్బంది కలిసి వందేమాతరం గేయాన్ని ఆలపించారు.