నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
NGKL: అచ్చంపేట మండలంలోని నడింపల్లి గ్రామ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గురువారం పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు సిబ్బందికి సహకరించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందని, ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.