సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన యువకుడు

సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన యువకుడు

HYDలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు తన ఇంట్లోనే బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కార్యక్రమంలో ఆభరణాలను గమనించిన అతడు, దశలవారీగా చోరీకి పాల్పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించి ఇద్దరు స్నేహితులతో కలిసి బంగారాన్ని విక్రయించాడు. 137 గ్రాముల బంగారం, 4 మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.