చెరువుల పరిరక్షణే లక్ష్యం
VZM: "జలధార-జల హారతి" కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి గురువారం సంబంధిత అధికారులతో ప్రత్యేక జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువును గుర్తించి, వాటిని ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని, సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. చెరువుల్లో పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.