నిమజ్జనానికి తరలిన అమ్మవారు
CTR: పుంగనూరు పట్టణంలోని సుగుటూరు గంగమ్మ జాతర ముగింపుకు చేరుకుంది. నిమజ్జనం సందర్భంగా ఇవాళ ఉదయం అమ్మవారికి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. అడుగడుగునా మహిళలు కర్పూర హారతులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు.