విజయవాడ షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడలోని గుణదల వద్ద ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మాల్‌లోని ఒక ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షాపింగ్ మాల్‌లోని పలు వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.