రేపు కాజీపేటకు కేంద్రమంత్రి రాక..!
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్య పురం గ్రామ శివారులో నూతనంగా నిర్మాణ పనులు జరుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలను రేపు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కోచ్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రంను కేంద్ర మంత్రి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు.