ఆపరేషన్ సింధూర్‌కు మద్ధతుగా తెలంగాణ జాగృతి ర్యాలీ

TG: పాకిస్తాన్‌పై భారత ఆర్మీ చేస్తున్న ఆపరేషన్ సింధూర్‌కు మద్ధతుగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. పీపుల్స్ ప్లాజా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత నేతృత్వం వహించనున్నారు. ఈ ర్యాలీలో యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని జాగృతి సంస్థ పిలుపునిచ్చింది.