MLAను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాడు
TG: MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైబర్ నేరస్థుడి చేతిలో రూ.లక్ష మోసపోయారు. ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీగా పరిచయం చేసుకున్న వ్యక్తి, నిరుద్యోగ యువతకు రుణాలంటూ MLAను నమ్మబలికాడు. యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన రూ.లక్ష ఫోన్ పే చేశారు. తీరా అసలు అధికారిని ఆరా తీయగా మోసం బయటపడింది. దీనిపై పల్లా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.